Magnus Carlsen:జీన్స్ కు ఓకే.. బరిలోకి కార్ల్సన్..! 3 d ago
ప్రపంచ నంబర్ వన్ ఆటగాడు మాగ్నస్ కార్ల్సన్.. బ్లిట్జ్ ఛాంపియన్షిప్ లో పోటీ పడనున్నాడు. నిబంధనలకు విరుద్ధంగా జీన్స్ వేసుకురావడం, దాన్ని మార్చుకోవాలి అని సూచించినా వినకపోవడంతో కార్ల్సన్ను ర్యాపిడ్ టోర్నీ నుంచి నిర్వాహకులు అర్ధంతరంగా తప్పించిన సంగతి తెలిసిందే. జీన్స్ వేసుకున్నందుకు అతడికి 200 అమెరికన్ డాలర్ల జరిమానా కూడా విధించారు. ఈ వివాదం నేపథ్యంలో.. ఫిడె నిబంధనలను సడలించింది. జీన్స్ వేసుకున్న క్రీడాకారులను అనుమతించేలా మార్పు చేసింది. "దుస్తుల విషయంలో ఇంకొంచెం సరళంగా వ్యవహరించాలని భావించాం. ఇప్పటికీ అధికారిక డ్రెస్ కోడ్ ను పాటించాల్సిందే. కానీ చిన్న సడలింపులు ఉంటాయి” అని ఫిడె అధిపతి ఆర్కాడీ ద్వొర్కోవిచ్ పేర్కొన్నాడు. ప్రపంచ బ్లిట్జ్ ఛాంపియన్షిప్లో కార్ల్సన్ పాల్గొంటున్న విషయాన్ని కూడా ఆర్కాడీ ధ్రువీకరించాడు.